మన్యం న్యూస్. ములకలపల్లి. మార్చి 20. ఇటీవల కురిసిన అకాల వర్సానికి రైతు పాలిట శాపం గా మారింది.ఈ సందర్బంగా మండలంలో ని పాతజిన్నెల గూడెం పంచాయితీ లొ పలు చోట్ల బాధిత రైతులను స్థానిక సర్పంచ్. ఎంపీటీసి కొర్సా గణపతి, మడకం విజయ పరామర్శించి తక్షణ నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
తుఫాను ప్రభావంతో ఆదివారం రాత్రి ఉరుములు మెరుపులు,భారీ ఈదురు గాలులతో వచ్చిన అకాల వర్షానికి మండలంలోని రాచన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రామన్నపేట, రాచన్నగూడెం, కొత్త జిన్నెలగూడెం, మోటుగూడెం, పాత జిన్నెలగూడెం గ్రామాలలో మామిడి,జీడిమామిడి రైతులకు తీవ్రనష్టానికి గురిచేసింది. ఈ గ్రామలలో అత్యదికంగా నివశించే గిరిజనులకు జీవనాదారం జీడిమామిడి సాగు,వేసవిలో ఈ మూడు నెలలలో వచ్చే ఫలసాయం, ఏడాడి మొత్తం ఆ గిరజన కుటుంబాలు తమ జీవనం కొనసాగిస్తుంటాయి,ఈ క్రమంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి పూత,పిందె మొత్తం రలిపోయిందని,పలు గ్రామాలలో భారీ గాలులకు రేకుల ఇల్లు, గుడిసెలు నేలకోరిగాయి.ఈ భారీ వర్షాల కారణంగా వందాలది ఎకరాల్లో జీడిమామిడి ల్లో పూత పిందే రాలిపోవడంతో లక్షలాది రూపాయలు గిరిజన రైతులు నష్టం పోవాలసిన పరిస్థితి నెలకొన్నది,నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం తక్షణమే ఎకరానికి 30 వేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని,ఇల్లు నెల కూలిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.