మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
మండలంలోని రామారావు పేట గ్రామానికి చెందిన ఎంటెక్ విద్యార్థి కళ్యాణ్ కుటుంబ సభ్యులను సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం పరామర్శించారు. తమ్మినేని కళ్యాణ్ తండ్రి చిన్నారావును మృతి గల వివరాలు అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు అండగా ఉండాల్సిన కళ్యాణ్ మృతి చెందడం బాధాకరమని ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పోతినేని సుదర్శన్ రావు రాష్ట్ర నాయకులు భాస్కరరావు జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య రాష్ట్ర నాయకులు మచ్చ వెంకటేశ్వర్లు ఎలమంచి రవికుమార్ బ్రహ్మచారి వంశీకృష్ణ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.