మన్యం న్యూస్ కరకగూడెం , మార్చి 20 కరకగూడెం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, ఆశ్రమ పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో బిజెపి రాష్ట్ర నాయకులు జాడి దేవేంద్ర వరప్రసాద్ పదవ తరగతి చదువుతున్న పిల్లలకు పరీక్షా సామాగ్రి అందజేశారు. మండలంలో ఉన్న 135 మంది పదవ తరగతి విద్యార్థులకు, 70 మంది 9వ తరగతి విద్యార్థులకు పెన్సిల్ స్కేలు పెన్ను చాకుమర్ రబ్బర్ హాల్ టీకెట్ పెట్టుకోవడానికి పాకెట్ కవర్ అందజేశారు. అన్ని పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించి విద్య దాని ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా 10వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ పరీక్ష సామాగ్రి అందించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. విద్యార్థులు విద్యార్థి దశనుండే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, ఉన్నత లక్ష్యాలను అందుకొని చదువుకున్న పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మన కోరారు. చదువు ద్వారానే విలువ గౌరవం దక్కుతుందని, అని ఆయన అన్నారు. పదవ తరగతి పిల్లలు పాఠశాల మొదటి స్థానం నిలిస్తే 2000 రూపాయలు నగదు బహుమతి అందిస్తామని, మండల మొదటి ర్యాంకు సాధిస్తే 5000 రూపాయలు నగదు అందజేస్తామని ఆయన తెలిపారు. విద్యార్థుల మధ్య ఆహ్లాదమైన పోటీ తత్వం ఏర్పడాలని కోటితత్వం ఉంటేనే ఉన్నత లక్ష్యాలను సాధిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజా, సీతారాంపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు,గడ్డం. మంజుల,ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగన్, బట్టుపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్య, కస్తూరి గాంధీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, స్కూల్ టీచర్లు పాల్గొన్నారు.
