మన్యం న్యూస్. ములకలపల్లి. మార్చి 20. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీవోఏ (గ్రామ దీపిక)ల సమస్యలను పరిస్కరించాలని, వి వొ ఏ లుగా పనిచేస్తున్న తమకు ప్రత్యక్ష, పరోక్షంగా పని భారం పెరుగుతూవస్తుందని, పనికి తగిన గుర్తింపు లేక, సరైన వేతనం లేక , ప్రస్తుతం ఉన్న పరిస్థితి లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివొఏ లు అందరు పారిశ్రామిక విధానాల చట్టం 1947సెక్షన్ -22సబ్ సెక్షన్ -1అనుసరించి వీవోఏ జిల్లా కమిటీ నిర్ణయం మేరకు మార్చి 20 నుండి ఏప్రిల్ 2 తారీకు వరకు 13రోజులు వరకు ఆన్లైన్, ఆఫ్ లైన్ పనులను నిలిపివేస్తున్నమని మెమోరాండం ఎపిఎమ్ కి అందజేశారు.ఈ కార్యక్రమంలో కనక మహాలక్ష్మి,ఎస్ కె షఫీయా, పెద్దుల్లమ్మ, జ్యోతి, కృష్ణకుమారి, విజయ్, సునీత, నర్సకుమారి, స్వరూప, కృష్ణకుమారి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
