మన్యం న్యూస్, భద్రాచలం , మార్చి 20..
ఈ నెల 25వ తేదీ వరకు శ్రీరామనవమి, మహాపట్టాభిషేక మహోత్సవాలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దేవస్థానం అధికారులను ఆదేశించారు. సోమవారం మిథిలా స్టేడియంలో చేస్తున్న కళ్యాణ ఏర్పాట్లును ఆయన ఎస్పీ డాక్టర్ వినీత్ తో కలిసి పరిశీలించారు. సెక్టార్లు ఏర్పాటును పరిశీలించి భక్తులు ఒక సెక్టారు నుండి మరొక సెక్టారులోకి రాకుండా పటిష్ట బందోబస్తు చేయాలని చెప్పారు. వివిఐపిలు, న్యాయమూర్తులు, ఉబయదాతలు, భక్తులు కొరకు చేయాల్సిన ఏర్పాట్లుపై అధికారులకు సూచనలు చేశారు. భక్తులకు సెక్టార్లులో తలంబ్రాలు పంపిణీ చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి సెక్టారులో మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలని అన్నారు. సెక్టారులోని భక్తులు వేడుకలు వీక్షణకు ఎల్ఎస్ఈడి టివిలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెద్దఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున స్వచ్చంద సంస్థల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వేడుకలు ముగిసిన తదుపరి భక్తులు తలంబ్రాలు కొరకు పెద్ద ఎత్తున ఒకే చోటికి చేరే అవకాశం ఉన్నందున, రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం దేవాలయాన్ని సందర్శించి ఏర్పాట్లు గురించి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈఓ రమాదేవి, భద్రాచలం ఆర్టీఓ రత్నకళ్యాణి, ఎఎస్పీ పరితోష్ పంకజ్, తహసిల్దార్ శ్రీనివాసయాదవ్, దేవస్థానం డిఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.