మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 20, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సేర్పే ఉద్యోగులకు పేస్కేల్ వర్తింపజేస్తూ, జీవో నెంబర్ 11ను విడుదల చేసిన సందర్భంగా, మండల కేంద్రంలోని మండల సమైక్య కార్యాలయంలో సోమవారం జూలూరుపాడు మండల సేర్పే సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సేర్పే ఉద్యోగులకు పేస్కేల్ వర్తింపజేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రాజు, లక్ష్మి శెట్టి రామారావు, దారావత్ నాగేశ్వరావు, బండ్ల మధు, వీరభద్రం, బాయమ్మ, తదితరులు పాల్గొన్నారు.
