ఎమ్మెల్సీ కవిత విచారణ సోమవారం పదిగంటలకు పైగా సాగి హైటెన్షన్ కలిగించింది. అరెస్ట్ పై అనేక ఊహాగానాలు వచ్చినా విచారణ ముగించుకుని ఆమె విక్టరీ సింబల్ చూపుతూ ఇంటికి చేరింది. ఈడీ ఆఫీసు నుంచి కవిత రాత్రి 9 గంటల 15 నిమిషాల సమయంలో బయటకు వచ్చారు. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆఫీసులోకి వెళ్లిన కవిత.. పది గంటల సుదీర్ఘ విచారణ తర్వాత బయటకు రావటం జరిగింది. మంగళవారం ఉదయం 11గంటలకు మళ్ళీ కవిత విచారణకు హాజరుకానున్నారు. 24వ తేదీ వరకు అరెస్ట్ ఉండకపోవచ్చన్న చర్చ ఉన్నది.
