మన్యం న్యూస్, మణుగూరు, మార్చి21: మణుగూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిలకు బుధవారం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఈ న్యూట్రిషన్ కిట్లు ఉపయోగపడతాయన్నారు. న్యూట్రిషన్ కిట్లు ప్రతిరోజు విద్యార్థులు తీసుకోవడం వల్ల మానసిక ఉల్లాసంగా ఉంటారన్నారు. విద్యార్థినిలు ట్రెస్ కు గురికాకుండా ఈ న్యూట్రీషన్ కిట్లు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల ఆయుర్వేద డాక్టర్ గుమ్మడి అరుణ, మణుగూరు ఎంపీపీ కారం విజయకుమారి, మణుగూరు పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అడపా అప్పారావు, మణుగూరు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మడి వీరన్న బాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు మేకల రవి, జడ్పీ స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
