మన్యం న్యూస్ ఏటూరు నాగారం, మార్చి 21
ఏటూరు నాగారం మండలం, రోహిర్ గ్రామం పరిధిలో 163 జాతీయ రహదారి పైన మంగళవారం అధిక లోడుతో వెళ్తున్న లారీ, కారును ఢీకొనగా అక్కడికక్కడే వ్యక్తి మరణించగా, తీవ్ర గాయాలతో ఉన్న మహిళను వరంగల్ హాస్పిటల్ కి తరలించారు. స్థానికుల వివరాల ప్రకారం, పోలిన శ్రీనివాసరావు (50) ఆయన కూతురు, నూగూరు వెంకటాపురం వారి గ్రామం నుంచి బంధువులను కలుసుకునేందుకు మంగపేట వెళ్తుండగా రొయ్యూరు గ్రామం జాతీయ రహదారి పైన ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.