మన్యం న్యూస్ గుండాల, మార్చి 21: గుండాల మండలం సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి కొన్ని శాఖల అధికారులు గైర్హాజరు అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీపీ ముక్తి సత్యం మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న సమస్యలన్నిటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆయన కోరారు. ఇప్పటివరకు జరిగిన ప్రగతి జరగాల్సిన ప్రగతిని పూర్తిస్థాయిలో జరిగే విధంగా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని ఆయన అన్నారు. మండలంలో కొన్ని శాఖల పనితీరు మెరుగుపరుచుకోవాలని ప్రజా ప్రతినిధులు సూచించారు. కొందరి అధికారులు మాత్రం సర్వసభ్య సమావేశానికి రావడానికి ఇష్టపడటం లేదని అలాంటివాళ్లు మండలంలో ఏం పని చేస్తారని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రామక్క,ఎంపీడీవో సత్యనారాయణ,ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
