UPDATES  

 విశ్వబ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి… సంఘం మండల అధ్యక్షులు సింహాద్రి శ్రీనివాస్..

మన్యం న్యూస్, పినపాక, మార్చి 21

విశ్వబ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని  సంఘ మండల అధ్యక్షుడు సింహాద్రి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం పినపాక మండలం జానంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళసూత్రాలు తయారీ హక్కుదారులుగా విశ్వబ్రాహ్మణ, స్వర్ణకారులకు వీలు కల్పిస్తూ చట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 2009లోని జీవో నంబరు 272ను రద్దు పరిచి, స్వర్ణకారులకు అనుకూలంగా సవరణలు చేయాలని డిమాండ్‌ చేశారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ స్వయం ప్రతిపత్తి కలిగిన ఇండస్ట్రీస్‌ డిపార్టుమెంట్‌ అనుసంధానంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. రజకులకు, నాయీ బ్రాహ్మణులకు ఇస్తున్నట్టు వంటి రూ.10వేలు ప్రోత్సాహం నాయీబ్రాహ్మణలకు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విశ్వకర్మజయంతి సెప్టెంబరు 17న ప్రభుత్వ సెలవు దినంగా లేదా ఆప్షన్‌ హాలీ డేగా ప్రకటించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం కార్యదర్శి అజయ్, ట్రెజరర్ సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు బసవచారి, బ్రహ్మం, నరసింహ చారి, సురేష్,హన్ను, సూరిబాబు, రామచంద్రు, రవి, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !