మన్యం న్యూస్ చండ్రుగొండ మార్చి 21: చిరుధాన్యాలు(మిల్లెట్స్ ) తింటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని ఐసిడిఎస్ సూపర్వైజర్స్ శకుంతల, రాణి అన్నారు. మంగళవారం చండ్రుగొండ -1 అంగన్వాడీ కేంద్రంలో మిల్లెట్స్ వాడకంపై గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సూపర్వైజర్స్ మాట్లాడుతూ… చిరుధాన్యాలు అంటే పోషకాలు కలిగిన ఆహారం,పోషణ విలువలు అధికంగా ఉంటే మిల్లెట్స్ తినడం వల్ల మంచి ఆరోగ్యం పొందవచ్చన్నారు. తల్లులు రక్తహీనత సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ బూచమ్మ, అరుణ,వినోద, సుజాత, మీనాక్షి,సరోజిని, విజయ,అరుణ,తదితరులు పాల్గొన్నారు.
