మన్యంన్యూస్ ఇల్లందు టౌన్, మార్చి 21 ఈ నెల 25,26,27 తేదీలలో మంచిర్యాలలో భారతకార్మిక సంఘాల సమాఖ్య ఇఫ్టూ తెలంగాణ రాష్ట్ర తొమ్మిదవ మహాసభలను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు తోడేటి నాగేశ్వరరావు,కొక్కు సారంగపాణి,ఇల్లెందు ఏరియా కమిటీ కార్యదర్శి నరాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
మంగళవారం ఇల్లెందులో ఐఎఫ్టియు కార్యాలయం ముందు, ముకుందాపురం క్యాంపు,పోలారం సెంటర్లలో రాష్ట్ర మహాసభ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఈ మహాసభలో చర్చించడంతో పాటు గత పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాట కర్తవ్యాలను రూపొందించడం జరుగుతుందని అన్నారు. మార్చి ఇరవై ఐదున (25) మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ కార్మిక ప్రదర్శన,బహిరంగ సభ జరుగుతుందని 26,27 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక కాబడిన ప్రతినిధులతో మహాసభ జరుగుతుందని అన్నారు.ఈ సభలకు ప్రొఫెసర్ హారగోపాల్, టిపిటిఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కే.నారాయణ,సీనియర్ జర్నలిస్ట్ ఎండి.మునీర్, సామాజిక కార్యకర్త గురజాల రవీందర్రావు, ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య, ఐఎఫ్టియు జాతీయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు అపర్ణ, బి.ప్రదీప్, జాతీయ కార్యదర్శి పోటు ప్రసాద్ తదితరులు హాజరై ప్రసంగిస్తారని పేర్కొన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు జటంగి వెంకన్న,పందిర్లపల్లి వీరన్న,రామిశెట్టి నరసింహారావు,తొగర సామెల్,ఆదేర్ల అంజయ్య,డి. నూనెశ్వరరావు, తొండల సర్వయ్య,పూణేం లక్ష్మణ్, మోరేవెంకటేశ్వర్లు, పి.రమేష్, ఎన్.రామారావు, అష్రాఫ్ పాష,ఉప్పలయ్య, గంగారపు కోటయ్య, ఏనూతుల నరసింహారావు, జయరాం సురేష్,గార్ల రాములు,దారావత్ చందు, తోలెం కృష్ణ, తోలెం నరేష్, పందిర్లపల్లి పుల్లయ్య,పందిర్లపల్లి వెంకన్న, పందిర్లపల్లి చిన్న శ్రీను,పెద్ద శ్రీను, శ్రీరామ్ యాకస్వామి,తేలే పెద్దబాబు,భీముడు తదితరులు పాల్గొన్నారు.