మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి, 21.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అశ్వరావుపేట పట్టణంలో గిరిజన భవనంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సిపార్స్ తో మంజూరైన 95 లక్షలు విలువచేసే 95 కళ్యాణ లక్ష్మి చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం అని, పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఒక వరం అని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం లేదని, తెలంగాణని ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాలలో కూడా ఇప్పుడిప్పుడే అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బండి పుల్లారావు, కార్యదర్శి వెంకన్న బాబు, వైస్ ఎంపీపీ ఫణీంద్ర, సర్పంచుల సంఘం అధ్యక్షుడు నారం రాజశేఖర్, సర్పంచులు సోమిని శివప్రసాద్, జ్యోత్స్న, ఎంపీటీసీలు అనసూర్య, భారతి, మండల నాయకులు మోహన్ రెడ్డి, సంపూర్ణ, బజారయ్య, శ్రీను, రవి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
