మన్యం న్యూస్, దమ్మపేట, మార్చి 21 అశ్వారావుపేట నియోజక వర్గ ఉపాధి హామీ కాంట్రాక్ట్ ఉద్యోగులు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుని వారి నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఎస్ఈఆర్పి ఉపాధి హామీ పదకములో 17 సంవత్సరాలుగా పని చేస్తున్న 3874 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు పే స్కేల్ ఇచ్చి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వినతి పత్రము అందజేసారు. ఈ విషయముపై స్పందించిన ఎమ్మెల్యే మెచ్చా ముఖ్య మంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్ళి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా ఉపాధి హామీ ఉద్యోగుల జెఏసీ చైర్మన్ వి సుధాకరరావు, కోశాధికారి జిడిఆర్. పట్నాయిక్, టిఏ యూనియన్ కోశాధికారి పి రాఘవరావు మరియు దమ్మపేట , ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, అశ్వారావుపేట మండలాల ఏపిఓలు, ఈసిలు, టిఏలు, కంప్యుటర్ ఆపరేటర్, అకౌంట్ అసిస్టెంట్ లు తదితరులు హాజరు అయ్యారు.
