మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి 21. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉగాది వేడుకలు జరుపుకోవాలనీ వైయస్సార్ తెలంగాణ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం మంగళవారం ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, పొగరు కలయికే ఉగాది పచ్చడి ప్రత్యేకత అన్నారు. చైత్రమాసంలో నిర్వహించే ఉగాది ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. మూగబోయిన కోకిల గొంతు సవరించుకొని కిలకిల రాగాలు చేసే ఈ ఉగాది ప్రకృతి రమణీయతకు చిహ్నంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మోడు వారిన చెట్లు చిగురించి పచ్చదనాన్ని పరిచే ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త మలుపు తిరగాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు ఆరంభం ఉగాది పర్వదినం కావడమే గొప్ప విషయమన్నారు. ప్రజలందరూ కరోనా తర్వాత ప్రస్తుతం కోలుకుంటున్న తరుణం లో ఉగాది వేడుకలను అత్యంత సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
