UPDATES  

 రోడ్డు ప్రమాదాలపై ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం… ఏడూళ్ళ బయ్యారం సి ఐ  రాజగోపాల్..

మన్యం న్యూస్, పినపాక:

అతివేగం, అవగాహన లేని డ్రైవింగ్ కారణంగా విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని ఏడూళ్ళ బయ్యారం సిఐ రాజగోపాల్ అన్నారు. గురువారం నాడు ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో డ్రైవర్లకు, ప్రయాణికులకు రోడ్డు ప్రమాదాల గురించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అదుపు చేయలేని వేగం, అవగాహన లేని డ్రైవింగ్ కారణంగా నిండు ప్రాణం బలైపోతుందని, వాహనదారులు ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యానికి చేర్చాలని అన్నారు.ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించేది పోలీసు వారి కసం కాదని ప్రతి ఒక్కరు గుర్తించాలని , తమ ప్రాణాలకు రక్షణ కోసమే హెల్మెట్ అని తెలియజేశారు. ట్రాక్టర్లు లారీల డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలు నడేపేటప్పుడు మద్యం సేవించరాదని అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు మద్యం సేవించి నడుపుతున్న వాహనాలలో ప్రయాణించ వద్దని సూచించారు. ప్రయాణంలో అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా కనపడినట్లయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా 100 కి సమాచారం అందించాలని తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !