మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వాసవి క్లబ్, వాసవి వనిత వైభవం ఆధ్వర్యంలో గురువారం పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఏకాగ్రతగా చదివి మండలంలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విఎన్ కే సీజీ ఎఫ్ అధ్యక్షుడు చిట్టూరి శేషు కుమార్, వనితా వైభవం ప్రెసిడెంట్ చిట్టూరి నాగరత్న మణి, ఆర్ సీ చిత్తలూరి రమేష్, జిల్లా పీఆర్ఓ కడవెండి విశ్వనాథ గుప్తా, ఇంఛార్జి డిస్ట్రిక్ట్ కేసీజీఎఫ్ బండారు నర్సింహరావు, ప్రతినిధులు చిత్తలూరి ఉమ, దోసపాటి స్వర్ణ, కొణిజర్ల కృష్ణమూర్తి, స్వరాజ్యం, ధనలక్ష్మి, సముద్రాల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
