- తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
- ఎకరానికి రూ.30 వేలు నష్టపరిహారం అందించాలి
- సిపిఐ ఎం ఎల్ ప్రజాపంధా ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం
మన్యం న్యూస్. ములకలపల్లి మార్చి 23.తుపాను ప్రభావంతో గత వారం రోజులుగా కురుస్తున్న వడగళ్ల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ ఎం ఎల్ ప్రజాపంధా మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం తహశీల్దార్ కు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పాత గంగారం ఎంపిటిసి మడకం విజయ, రాచన్నగూడెం సర్పంచ్ కొర్సా గణపతి మాట్లాడుతూ గత వారం రోజులు గా మండలంలో కురుస్తున్న అకాల వర్షాలతో మొక్కజొన్న, మామిడి, జీడిమామిడి, పొగాకు, అరటి రైతులు తీవ్ర నష్టం వాటిల్లిందని,ఆదివారం కురిసిన వడగళ్ల వర్షానికి రాచన్నగూడెం పంచాయితీ లో ని ఐదు గ్రామాల్లో ని గిరిజనుల జీవనాధారమైన జీడిమామిడి పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయని అన్నారు. నీటివనరులు లేక ఈ ప్రాంత గిరిజనులు వర్షాధారమైన జిడితోటలపై ఆధారపడి పంటపై వచ్చిన ఆదాయంమే వారికి జీవనాధారంఅని.ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు ఎకరానికి 30 వేల తక్షణ ఆర్థికసహయాన్ని అందించాలని డిమాండ్ చేశారు.పాత జిన్నెలగూడెం గ్రామంలో గాలిదుమారం కారణంగా ఇండ్లు కూలిపోయిన కుటుంబాలను ఆదుకుని డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరుచేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గణపతి,ఎంపీటీసి విజయ, ఉప సర్పంచ్ వగ్గెల వెంకటేష్ పార్టీ మండల నాయకులు. పద్దం లక్ష్మణరావు, బండారు నాగేంద్రబాబు, నకిరకంటి నాగేశ్వరరావు,మిడియం శ్రీను, ఊకే బాలరాజు,మడకం వెంకట్రావు, శ్యామల తదితరులు పాల్లోన్నారు.