UPDATES  

 పేరుకు పెద్ద దావకాన అందని ద్రాక్షగా మారిన వైద్యం నిర్లక్ష్యానికి నిదర్శనం సర్కార్ దావకాన..

  • పేరుకు పెద్ద దావకాన
  • అందని ద్రాక్షగా మారిన వైద్యం
  •  నిర్లక్ష్యానికి నిదర్శనం సర్కార్ దావకాన

మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం. పేరు గొప్ప ఊరు దిబ్బ అని చందంగా మారిన ప్రభుత్వ వైద్యశాల పేరుకే పెద్ద ఆసుపత్రి ఇక్కడ వైద్యం మాత్రం నిరుపేదలకు అందని ద్రాక్షగా మారింది.

వెంకటాపురం మండల కేంద్రంలో చుట్టూ ఉన్న గ్రామాలకు కలిపి ఒకటే ప్రభుత్వ దావకాన ఉంది. ప్రజలంతా అదే దావకానికి వస్తుంటారు. కానీ దావకానలో రాను రాను పరిస్థితులు అగమ్య గోచరంగా మారుతున్నాయి, పేరుకు పెద్ద దావకానని కొంతమేరకు వసతులు ఎక్కువ కల్పించిన వైద్యం చేయడానికి డాక్టర్లను నియమించిన, వారు రోగికి ఇవ్వడానికి మందులు లేకపోవడం., ఎక్స్ రేలు తీయడానికి మిషను పనిచేయకపోవడం , అధికారుల నిర్లక్ష్యాన్ని చెప్పకనే చెబుతుంది. రోగి ఏదైనా జబ్బుతో దావకానికి వెళితే మందులు లేవని ప్రైవేట్ మందుల దుకాణాలకు వెళ్లి తెచ్చుకోండి అని ఉచిత సలహా ఇవ్వడం పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల గురించి పత్రికల్లో ఎన్ని రాసినా కూడా ఈ విషయం పట్ల స్పందించకపోవడం పలు అనుమానాలకు తావి నిస్తున్నాయి, ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఇంత మొండి వైఖరిని ఈ ఏజెన్సీ గ్రామా దావకాన మీద చూపిస్తున్నారు అని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. కనీసం దెబ్బ తగిలితే తగిలిన గాయానికి రాయడానికి ఆయింట్మెంట్ కూడా లేకపోవడం, హాస్పిటల్ మొత్తంలో ఒకటే ఆయింట్మెంట్ ఉందని, చిన్నపిల్లలకి దగ్గుకు జలుబుకు సంబంధించి సిరప్ లు కూడా అందుబాటులో లేని వైనం ఈ దావకానల్లో కనిపిస్తుంది, ఒకవేళ మందులు అయిపోతే వాటిని దావఖానలో సమకూర్చడానికి కొన్ని రోజుల సమయం తీసుకోవడం ఏజెన్సీల పట్ల అధికారులకు ఉన్న శ్రద్ధ ఎంతో తెలుస్తుంది, అంతేకాకుండా ఒక రోగి పడుకునే బెడ్ మీద కూడా దుప్పట్లు లేకపోవడం ఎవరిని అడిగితేనే దుప్పట్లు వేయడం, గమనార్హం. ఇంకా కొసమెరుపు గూడెంలో నుంచి గుట్టల మీద నుంచి వచ్చే గిరిజనులను మాట్లాడే భాష డాక్టర్లకు అర్థం కాకపోవడం వారి రోగం ఏంటో చెప్పలేక గిరిజనులు ఇబ్బంది పడటం డాక్టర్లు ఎలా వారికి వైద్యం చేస్తారని చర్చని అంశంగా మారింది. రోజు రోజుకి మెడికల్ రంగంలో ఎన్నో కొత్త కఠినమైన రోగాలకు కూడా అందుబాటులో ఉండే ప్రభుత్వ దవాఖానాలు ఏజెన్సీలో మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నాయి, ఈ నిర్లక్ష్యంపై పత్రిక ప్రతినిధులు ఎంత గగ్గోలు చేసిన పై అధికారులుఏదో నామకర్థంగా వచ్చి చూసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయంటూ ఏజెన్సీ గ్రామాల ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు, అయినా కూడా చాప కింద నీరు లాగా అధికారులు అవలంబిస్తున్న పని తీరు ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకు ఇంత వివక్ష. ఎన్నో గ్రామాలు ఈ దావకాన వల్ల రోగులకు చేరువయ్యే వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని కనీసం మందుల సౌకర్యం కూడా లేకుండా ఉంటే డాక్టర్లకు ఎందుకు జీతాలు ఇవ్వాలని యాజమాన్యం ఎందుకని డాక్టర్లను

నియమించినప్పటికీ మందులు లేకపోతే ఉపయోగం ఏంటని ప్రజలు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా డాక్టర్లకు హిందీ రాకపోవడం గుట్ట మీద నుంచి వచ్చిన గిరిజనుల జబ్బు ఏంటో కూడా గుర్తు తెలియని విధంగా వాళ్ళు హిందీలో చెబితే డాక్టర్లకు భాష అర్థం కాకపోవడం కొసమెరుపుగా మారింది. ఇలా అయితే ఏ విధంగా గిరిజనులతోటి మాట్లాడి వాళ్ళు జబ్బుని తెలుసుకుంటారు. అని గ్రామ ప్రజలు కొంతమేరకు తెలుగు వచ్చిన గిరిజనులు వారి ఆవేదనని వెల్లబుచ్చుకున్నారు.

ఇకనైనా సంబంధిత అధికారులు ఈ విశాల పట్ల పూర్తి చర్య తీసుకుని ఈ దావకానల్లో డాక్టర్లకు అనుగుణంగా వారు రాసే మందులు అందుబాటులో ఉండే విధంగా . భాష పట్ల ప్రావీణ్యం ఉన్న వారిని నియమిస్తే వైద్యం అందరికీ అందుతుందని పలువురు తెలియజేశారు. ఇకనైనా ప్రభుత్వం దావకాన సంబంధిత అధికారులు దీని పట్ల చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !