- వేతనాలు పెంచాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు కు విఓఏలు వినతి
- తక్కువ వేతనంతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆవేదన
- తమ డిమాండ్లను పరిశీలించాలని వినతి
మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి, 23 సరిపడా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, వేతనాలు పెంచేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు కు విఓఏలు (గ్రామ దీపిక) లు గురువారం తాటిసుబ్బన్నగూడెం లోని ఆయన నివాసంలో వినతి పత్రం సమర్పించారు. వారు తాము చేస్తున్న పనిని ఇలా వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (ఎస్ఆర్పి) లో గ్రామ స్థాయిలో 17,606 మంది విఓఏలు (గ్రామ సంఘాల సహాయకులు) పని చేస్తున్నామని. 19 సం॥రాల నుంచి గ్రామాలలో మహిళల అభ్యున్నతికి మహిళ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తూ. మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా ఎదగడానికి వారికి అవగాహన కల్పిస్తూ చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించి వారికి లోన్స్ ఇప్పించి తిరిగి సక్రమంగా లోన్స్ చెల్లించే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు.. డ్వాక్రా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న లావాదేవీలన్నీ పుస్తక నిర్వహణ వేస్తూ ఎస్ హెచ్ జి లైవ్ మీటింగ్ పెట్టి అన్ని సంఘాలు ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నాము. మహిళా సంఘాల పనులే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న అన్నిరకాల సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.. తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 ఏళ్ళు దాటినా విఓఏల బ్రతుకులు ఏమీ మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విఓఏలు సెర్ప్ నుంచి కేవలం ఇచ్చేది.3,900/- లు గౌరవ వేతనాలు,మాత్రమే నని వాపోయారు. పెరిగిన నిత్యావసర ధరల కారణంగా దేనికి సరిపోక, కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు పడుచున్నాము’ అని ఆవేదన వ్యక్తం చేసారు.తగిన చర్యలు తీసుకొని, ప్రభుత్వముతో మాట్లాడి విఓఏలకు కనీసం రూ.26000/- గౌరవ వేతనము ఇప్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ దీపికలు జయలక్ష్మి, షాహినా, వెంకట మహాలక్ష్మి, రేవతి, కృష్ణకుమారి, అనసూర్య రజియా తదితరులు పాల్గొన్నారు.