UPDATES  

 సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ 92వ వర్ధంతి కి ఘన నివాళులు..

మన్యం న్యూస్, అశ్వరావుపేట, మార్చి, 23

అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో గురువారం భగత్ సింగ్ 92 వర్ధంతి సందర్బంగా స్థానిక భగత్ సింగ్ సెంటర్లో గల సర్దార్ భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలువేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భగా నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం మాట్లాడుతూ సర్దార్ భగత్ సింగ్ 92వ వర్ధంతిని జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమని, అతి చిన్న వయసు లోని బ్రిటిష్ వాళ్లకు తలవంచకుండా బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో దడ పుట్టించిన టైగర్ సర్దార్ భగత్ సింగ్ అని బ్రిటిష్ వాళ్ళు తనకి క్షమాభిక్ష పెడితే అంగీకరించక తృణప్రాయంగా ప్రక్కన పెట్టిన అమరవీరుడు సర్దార్ భగత్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గన్నేని రామకృష్ణ, మండల సహాయ కార్యదర్శి సయ్యద్ రఫీ, సంగం కృష్ణమూర్తి, ఏఐటియుసి నియోజకవర్గ నాయకులు దుర్నాటి సత్యనారాయణ, ఎండి, మున్న, గద్ద నాగరాజు, అర్జున్ రావు, మహిళా మండలి నాయకురాలు చీపుల సత్యవతి, దిల్షాద్ రిజ్వాన తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !