UPDATES  

 సింగరేణి హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో మెరుగైన వైద్య సేవలు:జిఎం దుర్గం రామ చందర్..

మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మార్చి 23

సింగరేణి హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో మెరుగైన వైద్య సేవలు అందజేయొచ్చని మణుగూరు ఏరియా జిఎం దుర్గం రామ చందర్ తెలిపారు. సింగరేణి హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై అవగాహన కల్పించడం కోసం గురువారం కార్పొరేట్ నుంచి హరిశంకర్ డిజిఎం ఐటి సంబంధిత అధికారులతో కలిసి మణుగూరు ఏరియాను సందర్శించడం జరిగింది అన్నారు.ఈ సందర్భంగా జిఎం దుర్గం రామచందర్ మాట్లాడుతూ,హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పట్ల అవగాహన యొక్క ప్రాముఖ్యతను వారు తెలియజేశారు.హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవగాహనతో ఉద్యోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించటం జరుగుతుంది అన్నారు.అనంతరం కార్పొరేట్ నుండి విచ్చేసిన హరిశంకర్, డిజిఎం ఐటి మాట్లాడుతూ, సింగరేణి హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఉద్యోగులు, సివిలియన్స్,కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంత మంది హాస్పిటల్ సేవలను వినియోగించుకున్నారు.వారికి ఎలాంటి వైద్యాన్ని అందించారు.ఎంతమంది ఉద్యోగులు ఇన్ పేషెంట్ లుగా, హైయ్యర్ సెంటర్స్ కి రిఫరల్ పై వెళ్ళారు,ఆన్ ఫిట్,ఫిట్ అయినవారు,క్రోనిక్ డిసీజెస్ కోసం మెడిసిన్ తీసుకున్నారా లేదా అనే వివరాలు తెలుసుకోవచ్చు అన్నారు.ఒక వేళ తీసుకొనట్లైతే వారి మ్యాన్ వే,ఫోన్ కు పాప్ అప్ మెసేజస్ అందుతాయి అన్నారు. ఉద్యోగులు ఆరోగ్యం పై సింగరేణి తీసుకుంటున్న జాగ్రత్తలకు ఇది ఒక నిదర్శనం అన్నారు.ఈ సింగరేణి హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఉద్యోగి యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా పర్యవేక్షణ జరుగుతుంది అని తెలిపారు. హరిశంకర్, డిజిఎం ఐటి అన్నీ గనుల సంక్షేమ అధికారులకు,మైన్ సేఫ్టీ అధికారులకు,హాస్పిటల్ హెచ్డి లకు,సిహెచ్పి,వర్క్ షాప్, ఎపిసి,సివిల్,ఫారెస్ట్రీ విభాగాల అధికారులకు,సంబంధిత సిబ్బందికి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం సివిల్ డి.వెంకటేశ్వర్లు, ఏఎసీ వెంకట రమణ,డిజిఎం ఐఈడి కే వెంకట్ రావు,డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్,డా శేషగిరి రావు,నాగ దీపు,డిప్యూటీ మేనేజర్,ఎన్విరాన్మెంట్ అధికారి జే.శ్రీనివాస్,సెక్యూరిటీ ఆఫీసర్ అబ్దుల్ షబీరుద్దీన్, కేపియూజి సేఫ్టీ అధికారి మధు బాబు,ఎస్ ఈ సివిల్ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్స్ అవినాష్,రామేశ్వర్ రావు, మదర్ సాహెబ్,ఐటి ప్రోగ్రామర్ ఎస్.సురేశ్,క్లరికల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !