మన్యం న్యూస్, ఇల్లందు రూరల్, మార్చి 23:- ఐఎఫ్టీయు రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతు నెహ్రూనగర్ లోని ఉషా టైల్స్ ఫ్యాక్టరీలో గురువారం రోజు జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో ఎప్రిల్ 2,3 తేదీలలొ జరిగే రాష్ట్ర మహాసభలను ఉద్దేశించి తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంసింగ్ మాట్లాడుతూ సంపద సృష్టి కర్తలు కార్మికులు అయినప్పటికీ శ్రమకు తగిన ఫలితం కార్మికులకు దక్కకుండా పోతుందన్నారు. కష్టానికి తగిన ఫలితంకొరకు, హక్కుల రక్షణకొరకు ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు.
దేశంలో సంఘటిత,అసంఘటిత రంగ కార్మికులకు రక్షణ లేకుండా పోతుందని,అసంఘటిత రంగ కార్మికులకు భద్రతతో కూడిన సమగ్ర చట్టం చేయాలన్నారు.కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా సవరణ చేసి కార్మికుల హక్కులను హరించి వేసి, కార్పొరేట్ శక్తులకు,పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరణ చేసిందన్నారు. సవరణకు వ్యతిరేకంగా కార్మికులు ఐఖ్యంగా పోరాడాలని,ఎప్రిల్ 2,3తేదీలలొ కొత్తగూడెంలొ జరుగు భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఇఎఫ్టీయు) రాష్ట్ర మహాసభలలొ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో యూనియన్ నాయకులు సనప రాంబాబు, బుగ్గ రవి, వెంకట్రామ్, రాధమ్మ, కవిత, బక్కమ్మ, పూల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.