మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు నందు స్థానిక వార్డు కౌన్సిలర్ జేకే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కంటివెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ అంకుషావలి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్,ఇల్లందు శాసనసభ్యులు హరిప్రియనాయక్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా తెలిపారు. కళ్ళను డాక్టర్లు పరీక్షించి దృష్టిలోపం ఉన్నవారికి వెంటనే కళ్ళజోళ్ళు ఏర్పాటు చేయడం అవసరమైతే ఆపరేషన్లకు పై ఆస్పత్రులకు పంపించడం ద్వారా ప్రజలందరికీ మంచి కంటి చూపు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యలక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కంటి వెలుగు వైద్య సిబ్బంది, అంగన్వాడి,మెప్మా సిబ్బంది, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
