మన్యం న్యూస్, మణుగూరు, మార్చి24: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఎవ్వరు అధైర్య పడ వద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు అన్నారు. ఆయన శుక్రవారం మణుగూరు మండలం కొండాయిగూడెం తిర్లాపురం గ్రామాల్లో అకాల వర్షాలకి దెబ్బతిన్న మామిడి తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పంట నష్టపోయిన బాధిత రైతులు, కౌలు రైతులకు ప్రభుత్వ పరంగా ఇచ్చే సహాయ పునర్వాస చర్యలు త్వరగా చేపట్టాలని అధికారులను కోరారు. మళ్ళీ రైతులు పుంజుకొని వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా అన్ని రకాల సహాయక చర్యలు అందించాలన్నారు. అకాల వర్షానికి నష్టపోయిన మామిడి రైతులను కూడా అధికారులు గుర్తించి ఆదుకోవాలని, ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముత్యం బాబు, మణుగూరు మండల సహాయ వ్యవసాయ అధికారి వీరేందర్ నాయుడు, పి ఏసీ ఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు..
