మన్యం న్యూస్,ఇల్లందు టౌన్..:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన పలు వివాహ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పట్టణ బీఆర్ఎస్ నాయకులు బోళ్ళ సాగర్ కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వదూవరులు ఆదిత్యా_దీప్తిలను ఆశీర్వదించారు. అనంతరం మామిడిగూడెం గ్రామ పంచాయతీకి చెందిన పాయం నాగమణి_ఆనంద్ ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈకార్యక్రమంలో వారివెంట స్థానిక సర్పంచ్ తాటి మౌనిక,సువర్ణపాక రామయ్య,ఎంపీటీసీలు తాటి యశోద, పాయం కృష్ణ ప్రసాద్, ఉపసర్పంచ్ తాటి రాంబాబు, నాయకులు మడుగు సాంబమూర్తి,బోళ్ళ సూర్యం,గుగ్లోత్ నాగార్జున, రావూరి సతీష్,బొల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు.
