మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం బీజేపీ మంగపేట మండలం అధ్యక్షులు లోడే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం లో లోడే శ్రీనివాస్ మాట్లాడుతూ సంవత్సరాలుగా శ్రమిస్తున్న అర్హులైన నిరుద్యోగుల భవిష్యత్తును టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీలతో కాలరాసిన బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రఅధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో రాజధాని హైదరాబాద్ కేంద్రంలో ఇందిరా పార్కు వేదికగా ఈనెల 25శనివారం రోజున ఉదయం10గ.ల నుంచి సాయంత్రం 5 గ.ల వరకు మా నౌకరీలు మాగ్గావాలే అనే నినాదంతో నిరుద్యోగ నిరసన దీక్ష జరుగితుంది.ఈ దీక్ష ద్వారా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి, లక్షలు ఖర్చు పెట్టి కోచింగు తీసుకొని,కుటుంబాలకు దూరమై,రాత్రింబవళ్ళు కష్టపడి చదివి గ్రూప్ పరీక్షలు రాస్తే డబ్బులకు,అధికారం కోసం ఆశపడి పేపర్లు లీక్ చేస్తే రాసిన అభ్యర్థుల భవితవ్యం ఏమి కావాలని ప్రశ్నిస్తూ?తెలంగాణ విద్యార్థుల కోసం తెలంగాణ భారతీయ జనతా పార్టీ పోరాడుతోంది. నష్టపోతున్న అభ్యర్థులకు నష్ట పరిహారం ఒక లక్ష రూపాయలు చెల్లించాలని,ఎలాంటి రుసుము లేకుండా వారికి మళ్ళీ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని,క్యాబినెట్ నుంచి కేటీ ఆర్ ను బర్తరఫ్ చేయాలని, పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపడుతోంది.కావున ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.