మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన జన సమితి మంగపేట మండల కన్వీనర్ పోలసాని అశోక్ రెడ్డి ఇటీవల మరణించగా వారి దశదిన కర్మకు శుక్రవారం హాజరై వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, మండల పార్టీ అధ్యక్షులు జయరామ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు తుడిభగవాన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అయ్యోరి యనయ్య, బ్లాక్ ఉపాధ్యక్షులు ధూళిపాల బాలకృష్ణ, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, సీనియర్ నాయకుడు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు,తదితరులు హాజరయ్యారు.