మన్యం న్యూస్ చండ్రుగొండ మార్చి 24 : పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని ఎంపీపీ బానోత్ పార్వతి,జెడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి లు స్పష్టం చేశారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ 2021-22 అవార్డుల ప్రధానోత్సవం లో పాల్గొని, పంచాయతీ సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులను ఘనంగా సన్మానించి,ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ… మండలంలోని 14 పంచాయతీలలో జాతీయస్థాయి అవార్డులు రావడం అభినందనీయమన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పనిచేసి అవార్డులు వచ్చేలా కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అన్నపూర్ణ, ఏపీవో తోట తులసీరామ్, మండల ప్రత్యేకాధికారి సంజీవరావు, ఎంపీటీసీలు,సర్పంచులు దారా వెంకటేశ్వరరావు, లంకా విజయలక్ష్మి, పూసం వెంకటేశ్వర్లు, ఇర్ప లక్ష్మీపతి, ఇస్లావత్ నిరోషా, గుగ్గులోత్ బాలాజీ, బానోత్ కుమారి, దారావత్ పార్వతి, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు నల్లమోతు వెంకటనారాయణ, బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు వంకాయలపాటి బాబురావు, కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
