మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి, 24..గత అయిదు రోజులుగా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. భక్తులకు అన్ని సౌకర్యాలను దేవస్థానం కమిటి ఏర్పాటు చేయగా, శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యలను అశ్వారావుపేట సిఐ బాలకృష్ణ అధ్వర్యంలో ఎస్ఐ రాజేష్ పోలీస్ శాఖ చేస్తున్న క్రుషి సర్వత్రా ప్రశంనీయంగా మారింది. మూడు నాలుగు అయిదవ రోజులలొ చుట్టుప్రక్కల పలు మండలాల నుంచి వేలాదిమంది వచ్చినప్పటకి ఇసుమంత ఇబ్బంది లేకుండా ప్రయాణాలు జరిగేలా ట్రాఫిక్ నియంత్రించడం పలువురు ప్రశంసలు అందుకొన్నారు. తమ విధి అయినప్పటికీ హజరైన భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తు ఆకట్టుకొన్నారు. ఏది ఏమైనా ఈ సారి జాతరలో పోలీస్ శాఖ పాత్ర ప్రశంసనీయమైంది.
