మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫ్రెండ్స్ ఫౌండేషన్ కొత్తగూడెం ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు వితరణగా చేశారు శుక్రవారం కూలిలైన్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సందర్భంగా పరీక్ష ప్యాడ్, జామెట్రీ కిట్‌లు అందజేశారు ఈ సందర్భంగా ఫ్రెండ్స్ ఫౌండేషన్ కొత్తగూడెం వ్యవస్థాపకుడు సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ పదో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కిట్లను అందజేయడం జరుగుతుందన్నారు సుమారు 300 మంది విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామ దేవి, ఉమా మహేష్ వార్ రావు, రవీందర్, సత్యవాణి , అరుణ, విజయ్, ఫౌండేషన్ సభ్యులు వికాస్, హీమన్, వీరస్వామి, డేవిడ్, రజనీకాంత్ శర్మ, ప్రీతి కుమారి, రీవాష్ రౌనక్, ఎస్ కె ఖాజాబాబా, రాంబాలక్, చోటేలాల్ భారతి తదితరులు పాల్గొన్నారు.
