మన్యం న్యూస్, మణుగూరు, మార్చి24: పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల వారీగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు బీఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 2 న పినపాక మండలం, 3వ తేదీన మణుగూరు టౌన్, 4వ తేదీన మణుగూరు టౌన్, 5వ తేదీన అశ్వాపురం మండలం, 6వ తేదీన బూర్గంపాడు మండలం, 7వ తేదీన ఆళ్లపల్లి మండలం, 8వ తేదీన గుండాల మండలం, 9వ తేదీన పినపాక మండలం, 10వ తేదీన అశ్వాపురం మండలం, 11వ తేదీన బూర్గంపాడు మండలం, 12వ తేదీన మణుగూరు రూరల్ మండలాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అజేయ మైన శక్తి గా బీఆర్ ఎస్ పార్టీ ఎదిగిందన్నారు. దేశంలో ఏ పార్టీకి లేనంత 60 లక్షల మంది పార్టీ కార్యకర్తలున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే అన్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలన్నారు. అద్భుతంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఆయన సూచించారు
