- కృషితో నాస్తి దుర్భిక్షం
- పల్లె సేవలకు ప్రశంసల జల్లు
- చుంచుపల్లి మండలంలో 13 గ్రామపంచాయతీలకు నేషనల్ పంచాయతీ అవార్డ్స్ ప్రధానం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా అన్ని రకాలుగా అత్యంత సేవలను అందించిన పంచాయతీ ప్రజా ప్రతినిధులకు కార్యదర్శులకు జాతీయస్థాయిలో అవార్డును పొందడం ఎంతో గర్వకారణమని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఈ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుంచుపల్లి మండలంలోని 18 గ్రామపంచాయతీలకు గాను 13 మంది అర్హత సాధించిన గ్రామపంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు ప్రశంసా పత్రాలు జ్ఞాపికలు శాలువాలతో సత్కరించడం ఎంతో ఆనందదాయకమన్నారు 2021_ 22 సంవత్సరానికి గాను గ్రామపంచాయతీలు 9 తీమ్ లు, ఒక్కొక్క తీమ్ కి 14 ప్రశ్నలతో మొత్తంగా 134 ప్రశ్నలు 100 మార్కులకు గాను పోటీ పడగా రాంపురం, అంబేద్కర్ నగర్, రుద్రంపూర్, .గౌతంపూర్ పెనగడప,4ఇంక్లినే, పెనుబల్లి, ప్రశాంతినగర్, .బాబుక్యాంపు, .విద్యానగర్ కాలనీ, .రామాంజనేయ కాలనీ, .చుంచుపల్లి .నంద తండా లు అర్హతలను సాధించినాయి. మొత్తం 18 పంచాయితీలలో ఐదు పంచాయతీలు వెంకటేష్ ఖని, వెంకటేశ్వర కాలనీ, .దన్ బాద్, ఎన్ కె నగర్, 3 ఇంక్లిన్ అర్హత నందు చోటు సాధించలేక పోయాయి అన్నారు. అందరూ సమిష్టిగా కృషిచేసి ప్రజల మందలను పొందడం గర్వకారణం అన్నారు.
ఈ కార్యక్రమంలో చుంచుపల్లి ఎంపీపీ బాధావత్ శాంతి చుంచుపల్లి మండల ప్రత్యేక అధికారిని సీఈవో మెరుగు విద్యాలత తహాసిల్దారు వనం కృష్ణ ప్రసాద్ ,ఎంపీడీవో సకినాల రమేష్ , ఎంపీఓ గుంటి సత్యనారాయణ , చుంచుపల్లి మండల వైస్ ఎంపీపీ వట్టి కొండ మల్లికార్జునరావు సర్పంచులు కార్యదర్శులు ఎంపీటీసీలు గ్రామపంచాయతీల పాలక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.