మండలంలోని అన్ని పంచాయతీలకు ఉత్తమ అవార్డు
సర్పంచులు కార్యదర్శుల కృషివల్లే అవార్డు వరించింది
మన్యం న్యూస్ గుండాల: మండలంలోని 11 పంచాయతీలకు ఉత్తమ పంచాయతీలుగా కేంద్రం అవార్డును ప్రకటించింది. అవార్డులు వచ్చిన సందర్భంగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సర్పంచులను కార్యదర్శులను ఎంపీపీ ముక్తి సత్యం, ఎంపీడీవో సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. మండలంలోని అన్ని పంచాయతీలకు అవార్డు రావడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. ప్రతి పంచాయతీలో ఉన్న సర్పంచ్, కార్యదర్శి విశేష కృషివల్లే వాటికి గుర్తింపు వచ్చిందని వారు అన్నారు. అవార్డు వచ్చిన ప్రతి పంచాయతీ సిబ్బందిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రామక్క, తహాసిల్దార్ నాగదేవ, సూపర్డెంట్ ప్రవీణ్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.