UPDATES  

 సింగరేణి గైర్హాజరు ఉద్యోగులకు కౌన్సిలింగ్ ఉద్యోగులు విధులకు తప్పకుండా హాజరు కావాలి:డిజిఎం పర్సనల్శ్ ఎస్.రమేశ్ ..

సింగరేణి గైర్హాజరు ఉద్యోగులకు కౌన్సిలింగ్

 

ఉద్యోగులు విధులకు తప్పకుండా హాజరు కావాలి:డిజిఎం పర్సనల్శ్ ఎస్.రమేశ్

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మార్చి 24

మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం.రామచందర్ ఆదేశంతో గైర్హాజరు ఉద్యోగులకు మణుగూరు ఎంవిటిసి నందు శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.2022 సంవత్సరం నందు మణుగూరు ఏరియా లోని కేపియూజి గని నందు విధులకు గైర్హాజరవుతున్న 8 మంది ఉద్యోగులను గుర్తించి, ఆ ఉద్యోగులకు,వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి,విధులకు హాజరు కాకపోవ్వడానికి కారణాలను అడిగి తెలుసుకున్న అనంతరం డ్యూటీ చేయటం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా ఏజిఎం కేపియూజి జి.నాగేశ్వర రావు మాట్లాడుతూ,చిన్న చిన్న కారణాలతో విధులకు గైర్హాజరు కావడం వల్లన వ్యక్తిగతంగా వేతనాలు కోల్పోవ్వడంతో పాటు,ఉత్పత్తి పరంగా సంస్థకు నష్టం వాటిల్లడం జరుగుతుందన్నారు.వ్యక్తిగత పనులు,అనారోగ్య సమస్యలు ఉంటే సంబందిత అధికారుల దృష్టికి తీసుకోవస్తే పరిష్కరించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులు క్రమం తప్పకుండ విధులకు హాజరు కావాలని సూచించడం జరిగింది.డిజిఎం పర్సనల్శ్ ఎస్.రమేశ్ మాట్లాడుతూ, సింగరేణి లాంటి ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం లభించడం గొప్ప అదృష్టంగా భావించాలని తెలిపారు.సింగరేణి సంస్థ ఉద్యోగులందరికి మంచి వేతనాలతో పాటు,సౌకర్యాలు కూడా ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది అన్నారు. నిబద్ధతతో క్రమం తప్పకుండ పనిచేస్తూ,యాజమాన్యం కల్పించే ప్రయోజనాలను అందరూ సద్వినియోగం చేసుకోవలసినదిగా వారు కోరారు.ఈ కార్యక్రమం లో డిజిఎం పర్సనల్ ఎస్.రమేశ్, డాక్టర్ సురేశ్,ఎంవిటిసి మేనేజర్ లక్ష్మణ్,సీనియర్ పర్సనల్ అధికారులు పిబి అవినాష్,వి రామేశ్వర రావు, కొండాపురం పిట్ సెక్రటరీ టిబిజికేఎస్ నాగేల్లి, ఉద్యోగులు,వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !