UPDATES  

 శ్రీరామనవమికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగవద్దు..

 

  • జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ డా.వినీత్.

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి.. పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు పతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సంబంధిత జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ ఈ నెల 30వ తారీఖున జరగబోయే శ్రీరామనవమికి వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని సూచించారు.భక్తులు భద్రాచలం చేరుకోవడానికి ఉపయోగించే రహదారుల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.బందోబస్తు ప్రకారం కేటాయించిన విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు,సిబ్బంది రోల్ క్లారిటీతో బాధ్యతగా పనిచేయాలని తెలిపారు.అనంతరం పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ ద్వారా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు.స్థానికంగా పోలీస్ అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని నిరంతరం సందర్శిస్తూ ఉండాలని,ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టి పోలీస్ శాఖపై నమ్మకాన్ని మరింతగా పెంచాలని కోరారు.ఫిబ్రవరి నెలలో వర్టికల్స్ వారీగా విధులలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు,సిబ్బందికి ప్రసంసా పత్రాలను అందజేశారు.

ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఇ.విజయ్ బాబు,భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ డిఎస్పీలు రమణ మూర్తి,వెంకటేష్,రాఘవేంద్రరావు,రెహమాన్, నందీరామ్,జిల్లాలోని సిఐలు,ఎస్సైలు,సిబ్బంది పాల్గోన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !