మన్యం న్యూస్ కరకగూడెం:మండల పరిధిలోని 10 గ్రామపంచాయితి లకు జాతీయ పంచాయితి అవార్డు 2021-2022 సంవత్సరాలకు గాను ఉత్తమ అవార్డు లభించిన సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామపంచాయితి సెక్రటరీ లను శుక్రవారం నాడు భట్టుపల్లి రైతు వేదికలో ఘనంగా సన్మానం చేసి ప్రశంస పత్రాలను ఎంపీపీ రేగా కాళికా, ఎంపీడిఓ శ్రీనివాస్ అందజేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశాభివృద్ధి పల్లెలే పట్టుకొమ్మలు,పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.సర్పంచ్, ఉపసర్పంచ్, సెక్రటరీ లు గ్రామ పంచాయితిలో చేసే అభివృద్ధి,వారి సేవలను గుర్తించి నేషనల్ అవార్డు ప్రకటించింది అన్నారు. అలాగే జాతీయ అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని,మును ముందు మరెన్నో అవార్డులు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్,ఉపసర్పంచ్,ఎంపిటీసి లు సెక్రటరీ లు పాల్గొన్నారు.
