మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ప్రజలకు అత్యంత ఆప్తుడుగా కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నిలిచారని మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ
కొత్తగూడెం పట్టణ క్రమబద్ధీకరణ జీవో 76 కట్ ఆఫ్ డేటు 2014 నుంచి 2020 వరకు పొడిగించినందుకు కొత్తగూడెం మున్సిపాలిటీకి రూ.115 కోట్ల రూపాయల నిధులను కొత్తగూడెం పట్టణానికి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు
కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కొరకై ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి రూ.115 కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ రఘు, అన్ని పార్టీల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.