UPDATES  

 సింగరేణి ఉద్యోగులకు చేంజ్ ఆఫ్ క్వార్టర్స్ కౌన్సిలింగ్ డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్..

సింగరేణి ఉద్యోగులకు చేంజ్ ఆఫ్ క్వార్టర్స్ కౌన్సిలింగ్

డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మార్చి 24

మణుగూరు ఏరియా లోని సింగరేణి ఉద్యోగులు నివాసముంటున్న పివి కాలనీ ఎంసి క్వార్టర్స్,టి-2 టైప్,ఛేంజ్ ఆఫ్ క్వార్టర్స్ ఎలాట్మెంట్,హౌస్ ఎలాట్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్ఓ టు జిఎం కార్యాలయం నందు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.ఏరియా క్వార్టర్ ఎలట్మెంట్ కమిటీ అధికారి,ఎస్ ఓ టు జిఎం డి.లలిత్ కుమార్ సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్ మాట్లాడుతూ, కౌన్సిలింగ్ లో ఎంసి,టి-2 టైప్ క్వార్టర్స్ పై భాగంలో నివాసముంటున్న ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులు అనారోగ్యం కారణాల వల్ల మెట్లు ఎక్కి దిగడానికి ఇబ్బంది పడుతున్నవారికీ,పై క్వార్టర్ నుంచి క్రింది క్వార్టర్ కేటాయించాలని 15 మంది ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించడం జరిగింది అన్నారు.ఆయా దరఖాస్తులలో పేర్కొన్న విధంగా అనారోగ్య కారణాల ధృవీకరణ పత్రాలను కంపెనీ డాక్టర్ పరిశీలించిన అనంతరం అర్హత గల ఉద్యోగుల జాబితాను రూపొందించడం జరిగింది అని వారు తెలిపారు. క్వార్టర్స్ ఖాళీలను బట్టి సీనియారిటీ ప్రకారం,క్రింది క్వార్టర్ కేటాయించడం జరుగుతాయని తెలిపారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జిఎం డి.లలిత్ కుమార్,ఏజీఎం సివిల్ డి.వెంకటేశ్వర్లు,డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్, టిబిజికెఎస్ యునియన్ ఉపాధ్యక్షులు వి ప్రభాకర్ రావు,డాక్టర్ సురేశ్,సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !