ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో జాతీయ క్షయ వ్యాధి నివారణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, డి ఎం హెచ్ ఓ అప్పయ్య పాల్గొన్నారు.ములుగు జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు అందించిన పి.హెచ్.సి లో వైద్య సిబ్బందికి ఉత్తమ సేవలు ప్రశంస పత్రాలు సమర్పించారు. ఈ అవార్డులలో ప్రధానంగా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ కుప్పిలి కోటిరెడ్డి కి ఉత్తమ సేవ అవార్డు ప్రశంస పత్రమును కలెక్టర్ కృష్ణ ఆదిత్య, డిఎంహెచ్ఓ అప్పయ్య, అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ పోరికా రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
