మన్యం న్యూస్ దుమ్మగూడెం::
మండల పరిధిలోని మారాయిగూడెం అంగన్వాడి సెక్టార్ పరిధి రామచంద్రుని పేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్షం సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సంబరాలను పురస్కరించుకొని ఆశ్రమ పాఠశాల ఆవరణలో ముగ్గు రంగులతో వేసిన ఐసిడిఎస్ లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామపంచాయతీ సర్పంచ్ కొర్స అశ్వని పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ చిరుధాన్యాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని ప్రతీ గ్రామంలో ప్రజలెవరూ పిల్లలు మహిళలు పోషణాలోపం లేకుండా ఆరోగ్యవంతంగా ఉండేందుకు అందరూ సహకరించాలని పరిశుభ్రత పాటించాలని అన్నారు అనంతరం. చిరుధాన్యాలు గురించి పిల్లలకు అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మహాలక్ష్మి, నాగరత్నం శాంతి అరుణ రామారావు అంగన్వాడీ సూపర్వైజర్ ధనలక్ష్మి, టీచర్లు బుచ్చమ్మ క్రిష్ణవేణి రాధ దుర్గ విద్యార్థినిలు పాల్గొన్నారు.