- ఓ మంచి మనిషిని కోల్పోవడం బాధాకరం
- పేర బోయిన ఐలమ్మ అకాల మృతి
- సంతాపం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కూనంనేని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాష
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
అందరికీ ఆప్తురాలు, ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలిచిన ఓ మంచి మనిషిని కోల్పోవడం బాధాకరమని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాష అన్నారు. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ పంచాయతీకి చెందిన పేర బోయిన ఐలమ్మ(70) శుక్రవారం కొమరెల్లి జాతరకు హాజరై గుండెపోటుతో జాతరలోని అకస్మాత్తుగా మృతి చెందారు. ఆమె భౌతికాయాన్ని విద్యా నగర్ కాలనీకి తీసుకువచ్చారు. ఆమె మరణ వార్త విన్న ప్రముఖులు శనివారం ఆమె భౌతిక ఆయన సందర్శించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐలమ్మ మొదటి నుంచి కమ్యూనిస్టు జీవితాన్ని గడపటమే కాకుండా ఆదర్శప్రాయంగా నిలిచారని ఆమె సేవలను కొనియాడారు. ఆమె అకాలంగా మృతి చెందడం కమ్యూనిస్టు పార్టీకి తీరనిలోటని అన్నారు. ఆమె నలుగురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. భౌతికకాయన్ని సందర్శించిన వారిలో తాళ్లూరి మధు, రాజేంద్రప్రసాద్, లంకె హనుమంతు, మద్దెల ఝాన్సీ రామ్, భోగ శ్రీధర్, మద్దెల రజనీకాంత్, భాస్కర్, నక్క సామ్సన్ రాజు, సీమకుర్తి రామకృష్ణ తదితరులు ఉన్నారు.