మన్యం న్యూస్ గుండాల: కలలోనైనా పూర్తికాని రహదారి పూర్తి కావడంతో చెట్టుపల్లి వాసుల కల నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా చెట్టుపల్లి వాసులు ఎదురుచూస్తున్న కలను ప్రభుత్వ విప్ పినపాక రేగా కాంతారావు నిధులు మంజూరు చేసి పూర్తి అయ్యే విధంగా ఆయన నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహించి తరగతిగా పనులను చేస్తూ పూర్తి చేశారు. చెట్టుపల్లి నుండి పోచారం వరకూ తొమ్మిది కిలోమీటర్లు కు 6 కోట్ల50 లక్షల రూపాయలను పి ఎం జి ఎస్ వై నిధులను విడుదల చేయించి పనులను ప్రారంభించారు. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా అధికారులకు సూచన లిస్టు పనులు సాఫీగా సాగే విధంగా రేగా ఎంతో కృషి చేశారు. ఏండ్ల తరబడి ఎదురుచూసిన ఎందరో నాయకులు హామీలు ఇచ్చిన ముందుకు పోనీ రోడ్డు కు నిధులు విడుదల చేసి పనులను సైతం పూర్తి చేయించారు. రహదారి పనులను పరిశీలించటం కోసం పలుమార్లు గుట్ట మార్గంలో ప్రయాణించి పరిస్థితిని అంచనా వేశారు. దగ్గరుండి పరిశీలించిన రోడ్డును తానే పూర్తి చేయాలని ద్రుడ సంకల్పంతో ముందుకు సాగిన రేగా అంతే స్ఫూర్తితో నిబద్ధతగా ముందుకు సాగారు. కలలో కూడా కాదనుకున్న రహదారి కానుండడంతో చెట్టు పల్లి వాసుల ఆనందం అంతా ఇంతా లేదు ఈ రహదారి పూర్తి అయితే వెన్నెల బైలు, శంభుని గూడెం, గోరకల మడుగు, నల్ల చిలక, చెట్టుపల్లి, రేగుల గూడెం గ్రామాల ప్రజలకు ఇల్లందు వెళ్లేందుకు ప్రయాణం శుభమం కానుంది. పనులను పంచాయతీరాజ్ డిఇ సైదులు రెడ్డి, ఏ ఈ అఖిల్ రహదారి పూర్తి కావడంలో వారి పాత్ర కీలకంగా ఉంది
