మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్నో ఏళ్ల చరిత్ర నుండి పదవ తరగతి పరీక్ష కేంద్రం నడుస్తుందని ప్రస్తుతం దుమ్ముగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు సంఖ్య తక్కువ ఉందని కారణంతో పరీక్ష కేంద్రం రద్దు చేయడం తగదని ఈ పరీక్షా కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుతూ పాఠశాల యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో శనివారం మండల విద్యాశాఖ వనరుల కార్యాలయంలో ఎంఆర్పి ఏజే ప్రభాకర్ అలానే దుమ్ముగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ ఈ పరీక్ష కేంద్రం మండల కేంద్రం ఉండడంవల్ల మిగతా పాఠశాల విద్యార్థులు పరీక్షలు రాయడానికి అనువుగా ఉంటుందని అలానే పోలీస్ స్టేషన్ కి అతి సమీపంలో ఉండి తక్కువ సమయం పడుతుందని అన్నారు ఇక్కడ పరీక్ష కేంద్రాన్ని తొలగించి మండల కేంద్రానికి సుదూర ప్రాంతమైన 30 కిలోమీటర్ల దూరంలో ఉండే కొత్తపల్లి గ్రామానికి ఎటువంటి పోలీస్ బందోబస్తు లేని సెంటర్ కి పరీక్షా కేంద్రానికి అనుమతిచ్చారని ఇది సబబు కాదని వారు తెలిపారు ఇప్పటికైనా అధికారులు మరో మారు ఆలోచించి దశబ్దాల కాలం చరిత్ర కలిగిన దుమ్ముగూడెం జిల్లా పరిషత్ పాఠశాలకు పరీక్ష కేంద్రాన్ని కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేష్ విద్యా కమిటీ సభ్యులు హుస్సేన్ అహ్మద్ బైరెడ్డి విశ్వేశ్వరరావు ముసలి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.