మన్యం న్యూస్ దుమ్మగూడెం::
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన జాతీయ పంచాయతీ పురస్కారంలో 2021 22 సంవత్సరం గాను దుమ్ముగూడెం మండలం చింతగుప్ప గ్రామ పంచాయతీకి ఉత్తమ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో జిల్లా స్థాయిలో మూడవ బహుమతి పొందారు. ఈ సందర్భంగా శనివారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఐడి ఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్స కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చింత గుప్ప సర్పంచ్ కట్టం కృష్ణ కార్యదర్శి పి వెంకట్ ను అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో విద్యాలత, జిల్లా డి ఆర్ డి ఓ మధుసూదన్ రాజు, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మి మండల పరిషత్ అభివృద్ధి అధికారి చంద్రమౌళి మండల పంచాయతీ అధికారి ముత్యాలరావు పాల్గొన్నారు.