మన్యం న్యూస్ ఇల్లందు టౌన్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సత్యనారాయణపురం అడవుల్లో కొలువై ఉన్న హజరత్ నాగుల్ మీరా మౌలా చాన్ దర్గా షరీఫ్ లో సీతారామ విగ్రహాల ప్రతిస్టాపన కార్యక్రమంతో శనివారం నవమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
సత్యనారాయణపురంలోని అడవి దర్గాలో వేద పండితుల నడుమ శ్రీసీతారామ సమేత హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశేష ప్రజానీకం భక్తి శ్రద్ధలతో హాజరయి, తన్మయత్వంతో పులకించిపోయారు. కుల, మతాలకు అతీతంగా ఈ దర్గాలో సీతారాముల కళ్యాణం నిర్వహించటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సుదూర ప్రాంతం నుండి వచ్చిన భక్తులకు అన్ని సౌకార్యాలు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.