మన్యం న్యూస్, మణుగూరు, మార్చి26: కంటి శుక్లాలు ముదిరిన వారికి సోమవారం, బుధవారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఏరియా కంటి వైద్య నిపుణులు, ఆఫ్తాల్మిక్ ఆఫీసర్ సంజీవరావు ఆదివారం తెలిపారు. కంటి ఆపరేషన్స్ చేయించుకోవాలనుకొనే వారు పినపాక, కరకగూడెం, మణుగూరు, అశ్వాపురం మండలాల్లో కంటి శుక్లాలు ముదిరిన వారు సోమవారం, బుధవారం నాడు మణుగూరు ఏరియా ఆసుపత్రికి వచ్చి కంటి వైద్య పరీక్షలు చేయిచుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లో బాగంగా ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్స్ చేస్తున్నారన్నారు. ఆరోగ్య శ్రీ కార్డ్,ఆధార్ కార్డ్ తప్పకుండా తీసుకొని రావాలని ఆయన తెలిపారు.