- విద్యా, ఆరోగ్యం,ఉపాధి ఉజ్వల భవిష్యత్తు అందరికి అవసరం .. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల
- నాకు ప్రేమే దైవం, సేవే నా మార్గం
- సుజాతనగర్ లో డాక్టర్ జి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
విద్య ఆరోగ్యం ఉపాధి ఉద్యమ భవిష్యత్తు అందరికీ అవసరమేనని డాక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస రావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు.వైద్య సేవలు అందించటానికి హైదరాబాద్ స్టార్ , కిమ్స్ హాస్పిటల్స్ నుంచి నిపుణులు అయిన వైద్యులు హాజరయ్యారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డా.గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ కూడు, గూడు, గుడ్డ తో పాటుగా ఆరోగ్యం చాలా ముఖ్యమని సుజాత నగర్ మండలంలోని సీతంపేట గ్రామం తన అమ్మమ్మ నివాసం,కొత్తగూడెం ప్రజలంతా నా కుటుంబ సభ్యులేననినా కుటుంబ సభ్యుల కోసం ఈ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశామని తెలియజేశారు.
తనను ఒక కుటుంబ సభ్యుడిగా భావించి, వేసే ప్రతీ అడుగులో తోడుగా ఉండి, ముందుకి నడిపిస్తున్న సుజాత నగర్ ప్రజలకు ఈ రకంగా సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు సంతోషం వ్యక్తపరిచారు.
తాను పుట్టి పెరిగిన నా ప్రాంత ప్రజలకి సేవ చేసుకునే ప్రతి అవకాశాన్ని అదృష్టంగా భావించి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, కుటుంబ సభ్యుల్లో ఒకడిగా భావించి తనను ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం నిర్వహణ సహకారం అందించిన హైదరాబాద్ కిమ్స్ స్టార్ హాస్పిటల్స్ యాజమాన్యానికి, హాజరైన సిబ్బందికి, నాయకులకు, ప్రతినిధులకూ, ఆప్తులు మిత్రులు, శ్రేయోభలాషులకూ, ట్రస్ట్ ప్రతినిధులకూ, వాలంటీర్ లకు, సహాయ సిబ్బందికి, కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సుజాతనగర్ సర్పంచ్ సికా కృష్ణవేణి, ఉప సర్పంచ్ లింగం పిచ్చి రెడ్డి, జడ్పీఎస్ స్కూల్ చైర్మన్ కె కృష్ణ, ఏఎంసి డైరెక్టర్ బోడ హరి, ఎంపీటీసీ పెద్ద మల్ల శోభారాణి, డా. రఘురాం, మాజీ ఎంపీటీసీ తాళ్ల భాస్కర్, చింతలపూడి శేఖర్ , మాజీ సర్పంచ్ సత్యనారాయణ, నాగేశ్వరరావు, ఉపేందర్, చంద్రశేఖర్, డా. అప్పారావు సాంబశివరావు ,కాంపల్లి కనకేష్ పటేల్ ,వెంకట్రావు… తదితరులు ప్రజా నాయకులు పాల్గొని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు డా. గడల శ్రీనివాస రావు ను ఘనంగా సన్మానించారు.