UPDATES  

 అబ్బ ఏం చెబుతుండ్రు సారో.. సమాజసేవ అంటిరి .. సెటైర్లు ఇస్తుంటిరి మీ “గడల” అల్లుకుపోతుంటిరి..

  • అబ్బ ఏం చెబుతుండ్రు సారో..
  • సమాజసేవ అంటిరి .. సెటైర్లు ఇస్తుంటిరి
  • మీ “గడల” అల్లుకుపోతుంటిరి
  • సేవలో రాజకీయం యమసక్కగున్నది
  • రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
  • కొత్తగూడెం రాజకీ(క)య్యాలు వేడెక్కుతున్నాయి

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి.. రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గం లో అధికారం కోసం ఆచి తూచి అడిగేస్తూ అధిష్టానం మెప్పు కోసం ఆయనేతలు సకల ప్రయత్నాలు చేసే పనిలో పడ్డారు. ఆయా పార్టీల బలాబాలాలు పక్కన పెడితే ఎవరికి వారే యమునా తీరంటూ పాచికల వేస్తూ ప్రజల దగ్గర మెప్పు పొందేందుకు ప్రదర్శిస్తున్న తీరు ఇంద్రజాలంలో మాంత్రికుడికే పెద్దన్న గా మారారు. తిరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆసన్నం అయ్యే గడియలు దగ్గరికి రావడంతో ఇప్పటి నుంచే గడపగడపకు ప్రచారాలు.. విధేయతను నేనేనంటూ వంగి దండాలు. .. సమాజ సేవా కార్యక్రమాలు ఆత్మీయ సమ్మేళనాలు.. ఇవన్నీ కొత్తగూడెం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉన్నట్లు… పదవి వ్యామోహం ఉన్న వ్యక్తులు రాజకీయ నేతల్లో కాక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు కనపడుతున్నారు. ఇటీవల కాలంలో కొత్తగూడం నియోజకవర్గంలో తనకంటూ ఒక క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకొని ఒకవైపు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా పని చేస్తూ మరోవైపు సమాజసేవకే ముందుకు వచ్చి సంచలమైన వ్యాఖ్యలు చేస్తున్న డాక్టర్ గడల శ్రీనివాస్ చేస్తున్న కార్యక్రమాలు సంచలనాన్ని రేపుతున్నాయి

 

సేవ అంటూనే సెటైర్లిస్తున్న గడల

కొత్తగూడెం నియోజకవర్గం లో అధికార పార్టీ తరపున టిక్కెట్ ఆశిస్తున్నారో లేదో తెలియదు గాని.. కొత్తగూడెంలో ఇటీవల కాలంలో నిర్వహించిన పలు ఉచిత ఉద్యోగ ,వైద్య శిబిరాలు ఎంతగానో సక్సెస్ అవుతున్నాయి. అయితే డాక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడే వ్యాఖ్యలన్నీ సంచలనల్ని రేపుతున్నాయి. తాను కొత్తగూడెం బిడ్డనని, పుట్టి పెరిగిన ఊరుకోసమే వచ్చానని, ప్రేమే దైవం సేవే మార్గం నినాదమే తెలుసునని, ఒకవైపు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేస్తూనే మరోవైపు కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిపై గతంలో ఏలిన పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దమని అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉందని నిధులు పుష్కలంగా ఉన్న వినియోగించుకోలేని స్థితిలో మనం ఉన్నామని.. ప్రజలు అవకాశం ఇస్తే మరింత సేవ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇన్ డైరెక్ట్ గా ఆయా పార్టీ నేతలకు సెటైర్లిస్తున్నారు. ఒకవైపు సమాజసేవ అంటూనే మరోవైపు సెటైర్లిస్తుండటంతో ప్రజల్లో మీ”గడల” అల్లుకుపోవడం వెనక ఆంతర్యం ఏమిటో అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాలలో పాత్రికేయులకు జరిగిన ఉచిత శిక్షణ శిబిరానికి హాజరైన డాక్టర్ గడల శ్రీనివాస్ తాను గన్ను పట్టుకోవాల్సిన వాడినని అనుకోని సందర్భంలో పెన్ను పట్టుకోవాల్సి వచ్చిందని సాక్షాత్తు కలం సోదరుల సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రతి ఒక్కరిని ప్రశ్నింపజేసింది.

 

సేవల్లో రాజకీయం యమ సక్కగున్నది సారు

సేవలు గడల రాజకీయం యమ సక్కగున్నది అంటూ కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడు తున్నారు. ఒకవైపు తెలంగాణ ఔన్నత్యాన్ని చాటుదామంటూ స్వయంగా కొత్తగూడెంలోని గడల క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలు పెడితే మహిళలతో డిజె స్టెప్పులు మేస్తిరి. తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుంటిరి… మరోపక్క కొత్తగూడెం నియోజకవర్గంలో ఆ అధికార పార్టీలో పని చేసిన , చేస్తున్న ప్రజా ప్రతినిధులందరూ చేతకాని వారింటివి… కొత్తగూడెం ని అభివృద్ధి పరచడంలో విఫలమయ్యారంటిరి.. రాష్ట్రంలో హెల్త్ డైరెక్టర్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు కొత్తగూడెం నియోజకవర్గంలో కొత్త రాజకీయాలకు రంగు పులుపునట్లు డాక్టర్ గడల శ్రీనివాస్ రావు మునుముందు చేసే సేవా కార్యక్రమాలు తన రాజకీయ భవిష్యత్తు కోసమా…? తాను పుట్టిన ఊరు బిడ్డల సంక్షేమం కోసమా..? ఏ మేరకు పనికొస్తాయి అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !